NTV Telugu Site icon

Droupadi Murmu: హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి వేసవి విడిది.. గవర్నర్, సీఎం స్వాగతం

Dkee

Dkee

వేసవి విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, అధికారులు ఘన స్వాగతం పలికారు. సిమ్లాలోని మషోబ్రాలోని రాష్ట్రపతి నివాస్‌లో రాష్ట్రపతి వేసవి విడిదిలో ఉండనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి: KTR: మతం పేరుతో రాజకీయం చేస్తే వారిని నమ్మకండి..

హిమాచల్‌ప్రదేశ్‌లో సుందరమైన ప్రదేశాలు ఉంటాయి. సహజ సిద్ధమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా పర్యాటక కేంద్రంగా మంచి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కొద్ది రోజుల పాటు ఈ ప్రకృతి అందాలను రాష్ట్రపతి ఆస్వాదించనున్నారు. అలాగే పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి: Kakarla Suresh: తండ్రి కోసం కొడుకు, కూతురు ఎన్నికల ప్రచారం..!

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. భానుడు భగభగ మండిపోతున్నారు. తీవ్రవేడితో ఉక్కపోత, చెమటలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్లు 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.