NTV Telugu Site icon

Delhi: మెట్రోలో రాష్ట్రపతి పర్యటన.. సడన్ ఎంట్రీతో షాకైన ప్యాసింజర్స్

Delhi Merto

Delhi Merto

దేశ ప్రథమ పౌరురాలు ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్యురాలిలో ప్రయాణికులతో కలిసి కూర్చుని జర్నీ చేయడంతో ప్యాసింజర్స్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎలాంటి హడావుడి.. హంగామా లేకుండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మెట్రో రైలు ఎక్కి ప్రయాణించారు. అంతేకాకుండా విద్యార్థుల ప్రక్కన కూర్చుని వాళ్లతో ముచ్చటించారు. రైల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhawan)కు సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను తొలుత ద్రౌపదీ ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను మెట్రో అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో ట్రైన్‌లో ప్రయాణించారు. సడన్‌గా రాష్ట్రపతి మెట్రో రైలు ఎక్కడంతో ప్రయాణికులు అవాక్కైయ్యారు.

ఇదిలా ఉంటే అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొఘల్‌ గార్డెన్స్‌తో పాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యటకుల కోసం ఢిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నాలుగో గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లొచ్చని తెలిపింది.