Site icon NTV Telugu

Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం

Murmu

Murmu

Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది కోసం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read Also: Congress: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులు వీరే..

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్:
డిసెంబర్ 18 (ఈరోజు) సికింద్రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు.
డిసెంబర్ 19న (రేపు) హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
డిసెంబర్ 20న (ఎల్లుండి) యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి సందర్శిస్తారు.
అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి ఎంఎన్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు.
డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Exit mobile version