Site icon NTV Telugu

Present Job Bore: నయా నౌకరీ కావాలి గురూ

Present Job Bore

Present Job Bore

Present Job Bore: ఇండియాలో సగం మందికి పైగా ఎంప్లాయీస్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఏమాత్రం ఎంజాయ్‌మెంట్‌ పొందలేకపోతున్నారు. ప్రజెంట్ జాబు పరమ బోరింగ్ అంటున్నారు. అందుకే కొత్త కొలువు కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఫీల్డ్ మారటం ద్వారా ఫ్లెక్సిబిలిటీ మరియు హ్యాపీనెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం అన్ని చోట్లా కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండింగ్.. సిబ్బంది మనోభావాలకు ఇబ్బందిగా మారింది. వెలగబెడుతున్న నౌకరీ ఎన్నాళ్లు ఉంటుందో తెలియని డోలాయమానం వల్ల కొంచెం ‘డిప్రెషన్’కి గురవుతున్నారు. మరో వైపు.. యాజమాన్యాలు కూడా తమ ఆలోచనా ధోరణి మార్చుకుంటున్నాయి.

కొత్త సంవత్సరంలో ‘ట్యాలెంట్ పీపుల్’ని సెలక్ట్ చేసుకోవటానికి నియామక ప్రక్రియలో కొత్త పద్ధతులు పాటించాలనుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాయం తీసుకోవాలని ఆశిస్తున్నాయి. ఈ విషయాలను ఇండీడ్ ఇండియా అనే సెర్చింజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది.

Exit mobile version