NTV Telugu Site icon

Masooda : త్వరలో ‘మసూద’మూవీకి ప్రీక్వెల్.. వెల్లడించిన ప్రొడ్యూసర్..

Whatsapp Image 2024 02 12 At 4.27.18 Pm

Whatsapp Image 2024 02 12 At 4.27.18 Pm

2022 లో థియేటర్స్ లో విడుదల అయిన ‘మసూద’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..ఈ మూవీలో యంగ్ హీరో తిరువీర్ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సీనియర్ హీరోయిన్ సంగీత ముఖ్య పాత్రలో నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాకి ప్రీక్వెల్ తీయనున్నట్లు ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా తాజాగా వెల్లడించారు.. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే.. ఫ్రెష్ సినిమాలు వస్తాయని అందుకే తాను కొత్త వాళ్లను తీసుకుంటాను అన్నారు. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘కొత్త టాలెంట్ వస్తోంది. అదే నా బిగెస్ట్ సపోర్ట్. కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు మరియు కొత్త రైటర్లు వచ్చినప్పుడు తాజా విషయాలు బయటికి వస్తాయి. రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. సినిమా ఇలానే తీయ్యాలి, అలానే తియ్యాలి అనే నోషన్స్ ఏమీ ఉండవు. ఈ రూల్స్ పాటించాలి అనేవి ఉండవు. భయం తెలియకుండా ధైర్యం వస్తుంది. ఐదేళ్ల తర్వాత నాకు భయం వస్తుందేమో..ఇలాంటి సినిమాలు అప్పుడు తియ్యలేనేమో.. కొత్త వాళ్లు వస్తే కంటెంట్ వస్తుంది. అలా చూసినప్పుడు నాకు నిజంగా ఆనందం కలుగుతుంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్.. మైథాలజీని కూడా ఫిక్షనలైజ్ చేశాడు. మైథాలజీనే ఫిక్షనల్.. అలాంటి దాంట్లో కూడా కొత్తగా రాశాడు’’ అని చెప్పారు. అయితే ‘ఏజెంట్ – 2’ సినిమా తీస్తే ఎవరితో కలిసి తీస్తారు? అని అడిగిన ప్రశ్నకు రాహుల్ ఆయన ఇలా సమాధానమిచ్చారు ‘‘ఏజెంట్ – 2 మూవీ ఎవరు చేయాలి అనేది సినిమా నిర్ణయిస్తుంది. స్వరూప్ దాని మీద వర్క్ చేస్తున్నారు. 6 నెలల నుంచి స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. స్వరూప్ వేరే సినిమా చేయాలి. నేను వేరే సినిమా చేయాలి. ‘మసూద’ ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. కాబట్టి ‘ఏజెంట్ – 2’కు ఏడాదిన్నర పట్టొచ్చు’’ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Show comments