Site icon NTV Telugu

SBI PO 2025: ఎస్బీఐలో ఉద్యోగాల జాతర.. వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నాహాలు

Sbi

Sbi

బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వరంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. సుమారు 3,500 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్‌లో బ్యాంక్ 505 ప్రొబేషనరీ ఆఫీసర్లను (POలు) నియమించుకుందని, అదే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ జరుగుతోందని SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (HR), చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (CDO) కిషోర్ కుమార్ పోలుదాసు PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read:Prabhas : ‘ఫౌజీ’తో తెలుగులోకి అడుగుపెడుతున్న కన్నడ బ్యూటీ..

స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి సంబంధించి, ఐటీ, సైబర్ సెక్యూరిటీ రంగాలను పర్యవేక్షించడానికి సుమారు 1,300 మంది అధికారులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా, ఖాళీగా ఉన్న 541 పిఒ పోస్టులకు ప్రకటనలు జారీ చేసినట్లు తెలిపారు. అదనంగా సుమారు 3,000 సర్కిల్ ఆధారిత ఆఫీసర్ పోస్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Also Read:Sreleela : ఈ ఏడాది ఒక్క హిట్ కూడా కొట్టని శ్రీలీల.. కారణం ఏంటి?

ఈ సంవత్సరం ప్రారంభంలో, SBI చైర్మన్ C.S. శెట్టి బ్యాంకు మొత్తం నియామకాలు వివిధ విభాగాలలో దాదాపు 18,000 ఉంటాయని ప్రకటించారు. వీటిలో దాదాపు 13,500 క్లరికల్ పోస్టులు, మిగిలినవి ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్థానికంగా పనిచేసే అధికారులు. మొదటి త్రైమాసికంలో, దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో SBI 13,455 జూనియర్ అసోసియేట్‌లు, 505 POల రిక్రూట్ మెంట్ ను ప్రకటించింది. ఐదు సంవత్సరాలలోపు మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పెంచే లక్ష్యంతో ఒక వ్యూహాన్ని రూపొందించిందని కూడా పోలుదాసు చెప్పారు.

Exit mobile version