NTV Telugu Site icon

Richest Ganesha: వినాయకుడికి రూ.400 కోట్ల ఇన్సూరెన్స్.. అంత స్పెషల్ ఏంటో..?

New Project 2024 08 26t114738.558

New Project 2024 08 26t114738.558

Richest Ganesha: ముంబైలో గణేశ్ ఉత్సావాలకు సన్నాహాలు మొదలయ్యాయి. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్‌బీ పండల్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ బీమా ధర రూ.400.58 కోట్లు. జీఎస్‎బీ సేవా మండల్ ప్రతి సంవత్సరం అత్యంత సంపన్నమైన గణపతి విగ్రహం కోసం వార్తల్లో నిలుస్తుంది.

Read Also:Polygraph Test: కోల్‌క‌తా మెడికో హ‌త్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. ఏం చెప్పాడంటే..?

అసలు విషయం ఏమిటి?
ప్రతి సంవత్సరం జీఎస్బీ సేవా మండల్ ఆధ్వర్యంలో గణేశోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. జీఎస్బీ రాజా ప్రసిద్ధ గణపతి పండాల్లో ఒకటి. వీటిని 5 రోజుల పాటు ముంబైలోని కింగ్ సర్కిల్‌లో ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం రూ. 400 కోట్ల బీమా పండల్ కు వచ్చే భక్తులు, వాలంటీర్లు, వంటవారు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, స్టాల్ కార్మికులకు కూడా వర్తిస్తుంది.

Read Also:Jammu Kashmir : జమ్మూలో44 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఇది కాకుండా ఇతర విభిన్న పాలసీల ఆధారంగా ఈ పండల్‌కు వచ్చే భక్తులతో పాటు, ఈ పండల్ బంగారం, వెండి, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన బీమా పాలసీలను కూడా కొనుగోలు చేస్తుంది. జీఎస్బీ సేవా మండల్ ఈ సంవత్సరం తన 70వ వార్షిక గణేషోత్సవాన్ని జరుపుకుంటుంది. సెప్టెంబర్ 5న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2023 సంవత్సరంలో ఈ పండల్ రూ. 360.40 కోట్ల బీమా రక్షణను తీసుకుంది. 5 రోజుల గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం వస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిఎస్‌బి గణేష్ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు.