NTV Telugu Site icon

Protein Dosa: బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ.. ఇలా చెయ్యండి

Untitled 19

Untitled 19

Health: ప్రస్తుతం చాల మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. ఇలా అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడంతో పాటుగా డైట్ ప్లాన్ తీసుకుని రుచికరమైన ఆహారానికి దూరం అవుతుంటారు. మీ డైట్ ప్లాన్ లో ఈ రెసిపీని కూడా కలుపుకుంటే మీరు రుచ్చికరమైన బ్రేక్ ఫాస్ట్ తింటూనే బరువు తగ్గించుకోవచ్చు. రుచికి రుచిని అందిస్తూ బరువు తగ్గడానికి ఉపయోగ పడే రెసిపీనే ప్రోటీన్ దోస. మరి ఈ దోసకి కావాల్సిన పదార్ధాలని మరియు తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Health tips: 150 వ్యాధులకు ఒకటే ఔషధం.. ర‌ణ‌పాల మొక్క ఉపయోగాలు

ప్రోటీన్ దోస తయారీకి కావాల్సిన పదార్ధాలు: పెసలు – 1 కప్పు , పశ్చనగలు-1 కప్పు , అలసందుపప్పు- 1 కప్పు , మినపప్పు-1 కప్పు
తయారీ విధానం : ముందుగా పప్పులన్నీ కలిపి ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా దోస పిండిలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని 30 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. ఇప్పుడు . స్టవ్ వెలిగించి దోస పెనం పెట్టుకోవాలి. పెనం కాస్త వేడిగా అయ్యాక దాని పైన మనం ముందుగా చేసిపెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ దోస పైన కాస్త నూనె వేసి కాలిన తర్వాత తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ప్రోటీన్ దోస రెడీ అవుతుంది. ఈ దోసని మీకు నచ్చిన చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.