Site icon NTV Telugu

Mamitha Baiju : మమిత బైజుకు హారతి ఇచ్చిన తెలుగు అభిమాని.. వీడియో వైరల్..

Mamitha Baiju

Mamitha Baiju

మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలును తెలుగులో కూడా విడుదల చేశారు.. ఆ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా హీరోయిన్ మమిత బైజు ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాదు.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. మలయాళంలో దాదాపు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. మళయాళంలోనే కాక తెలుగులో కూడా పేరు, అభిమానులని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈమె పేరే వినిపిస్తుంది..

తాజాగా మమితకు ఓ అభిమాని హారతి ఇచ్చాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈమె పేరు గత నాలుగు, ఐదు రోజులుగా తెగ వినిపిస్తుంది.. తెలుగులో ప్రమోషన్స్ కోసం ఆమె చీరలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది.. ఏకంగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవితో పోలుస్తున్నారు.. ఇక తెలుగులో సక్సెస్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఆ మీట్ లో ఓ తెలుగు అభిమాని ఆమెకు ఏకంగా హారతి ఇచ్చాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఓ అబ్బాయి ప్రేమలు సినిమా చూసినప్పటి నుంచి తనకు పెద్ద ఫ్యాన్ అయిపోయినట్లు చెప్పాడు.. అంతేకాదు సినిమాలో చాలా అందంగా ఉన్నారని చెప్పాడు.. అతను హారతి ఇవ్వడం చూసి చిత్ర యూనిట్ తో పాటు అక్కడికి వచ్చిన వారంతా షాక్ అయ్యాయి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి చూసేయ్యండి..

Exit mobile version