NTV Telugu Site icon

Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Premalu 2 1

Premalu 2 1

Premalu OTT Release Date Telugu: చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ప్రేమలు’.. మాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కొత్త‌త‌రం ప్రేమ‌క‌థ‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. గిరీశ్‌ ఎ.డి. తెరకెక్కించిన ఈ సినిమాలో నస్లెన్‌ కె.గఫూర్‌ , మ్యాథ్యూ థామస్‌ , మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రేమలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 8న తెలుగులో విడుదలైన ప్రేమలు ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ మాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

ప్రేమలు మూవీ ఏప్రిల్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్ అవుతుందని డిస్నీ స్టార్ ప్రకటించింది. అయితే తెలుగు ఓటీటీ రిలీజ్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చింది. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ‘అందరూ ఎంతగానో ఇష్టపడే చిత్రం ‘ప్రేమలు’ ఆహాలో వస్తోంది. ఆధునిక ప్రేమ విందు కోసం అబ్బాయిలు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. మలయాళ వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read: Ashok Galla: డిజిటల్ క్రియేటర్‌కు యువ హీరో అశోక్ గల్లా ఆర్థిక సహాయం!

ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి సహా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసించారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారంటూ చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు చాలా నవ్వుకున్నానని మహేష్ చెప్పిన విషయం తెలిసిందే. థియేటర్లలో సత్తాచాటిన ప్రేమలు.. ఓటీటీలో కూడా దూసుకుపోవడం ఖాయం.

Show comments