NTV Telugu Site icon

Premalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’.. తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Premalu 2 1

Premalu 2 1

Premalu Movie Available on Aha: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్న మలయాళీ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలు’. ఈ చిత్రంకు గిరీశ్‌ ఎడి దర్శకుడు కాగా.. నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమలు సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. దాదాపు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రంకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో అందుబాటులో ఉంది. గురువారం అర్ధరాత్రి (ఏప్రిల్ 12) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షన్‌ మాత్రమే ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయిన వారు ఈ సినిమాను ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: Suryakumar Yadav: ఒకే ఓవర్లో 24 రన్స్.. సూర్యతో ఇట్లుంటది మరీ!

స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ చేస్తుండగా కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ధైర్యం లేక కాలేజీ చివ‌రిరోజు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. అయితే అప్ప‌టికే వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని ఆ అమ్మాయి చెబుతుంది. తొలి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌… యూకే వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీసా రాదు. దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకుంటాడు. ఓ పెళ్లి వేడుక‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రీనూ (మ‌మిత బైజు) క‌లుస్తాడు. తొలి చూపులోనే స‌చిన్ ప్రేమ‌లో ప‌డిపోతాడు. మ‌రి ఈసారైనా స‌చిన్ ప్రేమక‌థ సక్సెస్ అయిందా? లేదా మరోసారి అత‌ని హార్ట్ బ్రేక్ అయ్యిందా? అన్నది మిగిలిన కథ.

Show comments