NTV Telugu Site icon

Mamitha Baiju : రెమ్యూనరేషన్ ను పెంచేసిన ప్రేమలు హీరోయిన్?

Mamitha Baiju

Mamitha Baiju

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువ అవుతుంది.. కొత్త హీరోయిన్లు చేస్తున్న మొదటి సినిమాలు కూడా బాగా హిట్ అవుతున్నాయి.. దాంతో తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచేస్తున్నారు.. చాలా మంది ట్రెండ్ అవుతున్నప్పుడే రెమ్యూనరేషన్ ను కూడా పెంచేస్తున్నారు.. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు కూడా అదే పని చేస్తుంది.. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్‌ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది.. గతంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అవ్వగా.. రీసెంట్ గా ప్రేమలు సినిమా భారీ సక్సెస్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది..

ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది.. తమిళ హీరో సూర్య సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది.. కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి బయటకు వచ్చేసింది.. అంతేకాదు డైరెక్టర్ బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.. అయితే ఈ చర్చ ఎక్కడ తన కేరీర్ ను నాశనం చేస్తుందనుకుందో కానీ తనను కొట్టలేదని క్లారిటీ ఇచ్చింది..

ఇక ప్రేమలు సూపర్ సక్సెస్ అవ్వడంతో సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం తమిళ హీరో జీవి ప్రకాష్ తో రెబల్ అనే చిత్రంతో కొలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఆ తర్వాత విష్ణువిశాల్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది.. దాంతో ఇక్కడ కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.. ఇండస్ట్రీలో అమ్మడుకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ ను పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు 30 లక్షలు తీసుకుంటుందట.. ఇకముందు చేయబోయే సినిమాలకు 50 లక్షలు తీసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..