Site icon NTV Telugu

Premalo : యాంకర్ గా మారిన ‘ప్రేమలో ‘ హీరో.. ఆసక్తికరంగా ట్రైలర్ లాంచ్..

Whatsapp Image 2024 01 23 At 8.16.51 Am

Whatsapp Image 2024 01 23 At 8.16.51 Am

చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీఖర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే చిత్రాన్ని నిర్మించారు. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు.ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు.అనంతరం.. హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఆనందం. ఇంతవరకు సరైన గుర్తింపు లేకపోయినా కూడా ఇక్కడే ఉన్నానని, ఇప్పుడు ప్రేమలో అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నా అని అన్నారు. నేను హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను శివాజీ రాజా గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు.ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడిందని, హీరోయిన్ చరిష్మా శ్రీకర్ చక్కగా నటించారన్నారు.

కెమెరామెన్ రామ్ పి నందిగం ఎంతో నాచురల్ గా ఈ సినిమాను తీశారని అలాగే ఎడిటర్ గా చేసిన పవన్ కళ్యాణ్ మేజర్ మరియు రైటర్ పద్మభూషన్ వంటి చిత్రాలు చేశారన్నారు. నేను అడగ్గానే నా కోసం ఈ సినిమాకు ఆయన ఒప్పుకున్నారన్నారు. రవి మంచి డైలాగ్స్ రాశాడని అలాగే ఈ సినిమాకు సందీప్ మంచి సంగీతం ఇచ్చాడని తెలిపారు..ఈ సినిమాలో భారీ తారాగణం, ఎలివేషన్స్ అలాగే టెక్నీషియన్స్ లేరు.. కానీ ఈ చిత్రంలో భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది. అందుకే ఈ సినిమాను చేశాను. భారీ ఎమోషన్స్ పండించాలంటే బడ్జెట్ ఉండాల్సిన పని లేదని అన్నారు.నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు యాంకర్ లేరని చెప్పడం చాలా బాధగా అనిపించింది అయితే టీ రాజేందర్.. ఆయనే హీరో, ఆయనే ఎడిటర్.. ఆయన దర్శకుడు.. కానీ ఆయన యాంకరింగ్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు చందు యాంకరింగ్ కూడా చేశాడు. ఇదో కొత్త రికార్డ్ అని అన్నారు. మా గురువు వి. మధు సూధన్ గారి అమ్మాయి వాణి ఫోన్ చేసి ఈ టీం కి హెల్ప్ చేయమని అడిగారు. ఆమె మాట మీద నేను మూడు రోజుల క్యారెక్టర్ చేశా చందు ప్యాషన్ చూసి నేను మూడ్రోజుల ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమని చెప్పాను అని అన్నారు.

Exit mobile version