Premalo : యాంకర్ గా మారిన ‘ప్రేమలో ‘ హీరో.. ఆసక్తికరంగా ట్రైలర్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీఖర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే చిత్రాన్ని నిర్మించారు. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు.ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు.అనంతరం.. హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఆనందం. ఇంతవరకు సరైన గుర్తింపు లేకపోయినా కూడా ఇక్కడే ఉన్నానని, ఇప్పుడు ప్రేమలో అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నా అని అన్నారు. నేను హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను శివాజీ రాజా గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు.ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడిందని, హీరోయిన్ చరిష్మా శ్రీకర్ చక్కగా నటించారన్నారు.
కెమెరామెన్ రామ్ పి నందిగం ఎంతో నాచురల్ గా ఈ సినిమాను తీశారని అలాగే ఎడిటర్ గా చేసిన పవన్ కళ్యాణ్ మేజర్ మరియు రైటర్ పద్మభూషన్ వంటి చిత్రాలు చేశారన్నారు. నేను అడగ్గానే నా కోసం ఈ సినిమాకు ఆయన ఒప్పుకున్నారన్నారు. రవి మంచి డైలాగ్స్ రాశాడని అలాగే ఈ సినిమాకు సందీప్ మంచి సంగీతం ఇచ్చాడని తెలిపారు..ఈ సినిమాలో భారీ తారాగణం, ఎలివేషన్స్ అలాగే టెక్నీషియన్స్ లేరు.. కానీ ఈ చిత్రంలో భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది. అందుకే ఈ సినిమాను చేశాను. భారీ ఎమోషన్స్ పండించాలంటే బడ్జెట్ ఉండాల్సిన పని లేదని అన్నారు.నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు యాంకర్ లేరని చెప్పడం చాలా బాధగా అనిపించింది అయితే టీ రాజేందర్.. ఆయనే హీరో, ఆయనే ఎడిటర్.. ఆయన దర్శకుడు.. కానీ ఆయన యాంకరింగ్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు చందు యాంకరింగ్ కూడా చేశాడు. ఇదో కొత్త రికార్డ్ అని అన్నారు. మా గురువు వి. మధు సూధన్ గారి అమ్మాయి వాణి ఫోన్ చేసి ఈ టీం కి హెల్ప్ చేయమని అడిగారు. ఆమె మాట మీద నేను మూడు రోజుల క్యారెక్టర్ చేశా చందు ప్యాషన్ చూసి నేను మూడ్రోజుల ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమని చెప్పాను అని అన్నారు.
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Tags
- Premalo movie
- release
- trailer
తాజావార్తలు
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!