Site icon NTV Telugu

Preity Zinta Photoshoot: ఫస్ట్ ఫోటోషూట్ పిక్ షేర్ చేసిన ప్రీతి జింటా.. ఎంత ముద్దుగా ఉందో!

Preity Zinta

Preity Zinta

Preity Zinta’s 1st Photo from her first photoshoot: ‘ప్రీతి జింటా’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాపిల్‌ బ్యూటీగా, డింపుల్‌ గర్ల్‌గా కుర్రాళ్ల మదిలో చెదరని ముద్ర వేశారు. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతి.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సొట్టబుగ్గల సుందరి ప్రీతి.. ఐపీఎల్ 2024తో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రీతి జింటా తాజాగా తన కెరీర్ ప్రారంభ రోజులలోని ఓ ఫోటోషూట్ పిక్ అభిమానులతో పంచుకున్నారు.

ప్రీతి జింటా తన మొదటి ఫోటోషూట్ నుండి ఓ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘నేను కొన్ని పాత ఫొటోస్ చూస్తున్నాను. ఈ ఫోటో నా కంట పడింది. ఓ మై గాడ్.. ఇది నా మొదటి ఫోటోషూట్‌కు సంబందించినది. నాకు అప్పుడు 20 ఏళ్లు. ఫోటోషూట్‌కి ఎలా పోజులివ్వాలో తప్ప.. ప్రపంచం గురించి ప్రతిదీ నాకు తెలుసు అని అనుకున్నాను’ అని పేరొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ‘ప్రీతి.. ఎంత ముద్దుగా ఉందో’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. నీయవ్వ ‘తగ్గేదేలే’!

ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మది కూడా సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా దోచారు. 49 ఏళ్ల ప్రీతి 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సంస్థలో ఫైనాన్స్ ఉపాధ్యక్షునిగా జీన్ పనిచేస్తున్నారు. జీన్, ప్రీతిలో సరోగసి విధానంలో కవల పిల్లలు ఉన్నారు.

Exit mobile version