Site icon NTV Telugu

Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!

Preity Zinta

Preity Zinta

Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు పరాజయం చెందడంతో సహ యజమాని ప్రీతీ జింటా భావోద్వేగంగా స్పందించారు. జూన్ 3న అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్‌ కు రెండో ఫైనల్ కాగా.. మళ్ళీ టైటిల్ గెలిచే అవకాశం చేజార్చుకోవడం బాధ కలిగించింది.

Read Also: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టు అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించగా, 4 మ్యాచ్ లలో ఓడిపోయారు. మరో మ్యాచ్ ఫలితం రాలేదు. దీనితో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో జట్టు 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన పంజాబ్, క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు ప్రవేశించింది. కానీ చివరి మ్యాచ్‌లో మరోసారి ఓడి కప్ గెలవలేకపోయింది.

ఈ నేపథ్యంలో ప్రీతీ జింటా సోషల్ మీడియా వేదికగా తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఇది మనం కోరుకున్న విధంగా ముగియలేదు. కానీ, ప్రయాణం అద్భుతంగా సాగింది. ఉత్సాహంగా, ప్రేరణగా, థ్రిల్లర్ సాగిన ఈ సీజన్‌ మా యువ జట్టు చూపించిన పోరాటమే కాదు.. పట్టుదల కూడా అద్భుతం అంటూ రాసుకొచ్చారు. మా కెప్టెన్ ముందు నుంచి నాయకత్వం వహించడమే కాకుండా, అనుభవంలేని భారతీయ ఆటగాళ్లను కూడా ఈ ఐపీఎల్‌లో రాణించడానికి కృషి చేసాడని ఆమె పేర్కొన్నారు.

Read Also: Geeta Singh: సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్న కితకితలు హీరోయిన్

అంతేకాకూండా.. ఈ సంవత్సరం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.. మేము కొన్ని కీలక ఆటగాళ్లను గాయాలకు గురి అవ్వడం వల్ల వారి సేవలను కోల్పోయినా, టోర్నమెంట్ మధ్యలో నిలిచినా, హోం మ్యాచ్‌ లను ఇతర రాష్ట్రాలకు మార్చినా, స్టేడియాన్ని ఖాళీ చేసినా మేము ముందుకు సాగాం అంటూ రాసుకొచ్చారు. దశాబ్దం తర్వాత టేబుల్ టాప్‌లో నిలిచాం. ఫైనల్ వరకు ఫైటింగ్ ఇచ్చాం. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిపై నమ్మకం ఉంది. మా సపోర్ట్ స్టాఫ్‌కు, మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్, షేర్ స్క్వాడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ ఆదరణ వల్లే మేము ఇంత దూరం వచ్చాం. పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే సంవత్సరం మళ్ళీ స్టేడియంలో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ ప్రేమతో… టింగ్! అంటూ తన సందేశాన్ని ముగించారు.

Exit mobile version