Site icon NTV Telugu

Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్

Preity Zinta

Preity Zinta

Preity Zinta: ఐపీఎల్‌ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS) జట్టు ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో.. 11 ఏళ్ల తర్వాత మొదటిసారి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఈ విజయంతో జట్టు క్వాలిఫయర్ 1లో పోటీకి సిద్ధమైంది. మరోవైపు ముంబై ఓటమితో ఎలిమినేటర్ 1లో తలపడాల్సి ఉంటుంది. ఇక విజయంతో పంజాబ్ కింగ్స్‌ సహ యజమానిగా ఉన్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా సెలబ్రేషన్స్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మితిమీరిన ఆనందంతో ఆమె ఓ చిన్నపిల్లల ఉన్న చోట ఎగురుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.

Read Also: Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాట్టింగ్ చేప్పట్టిన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్ ఓపెనింగ్ చేశారు. శుభారంభం ఇచ్చినప్పటికీ రికెల్టన్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రోహిత్ కష్టంగా 24 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. తిలక్ వర్మ, విల్ జాక్స్ త్వరగా ఔట్ అయినా సూర్యతో కలిసి హార్దిక్ పాండ్యా, తర్వాత నామన్ ధీర్ కొంత వరకు స్కోరును పెంచారు. ఇక మొత్తంగా ముంబై స్కోరు 184/6గా నిలిచింది. ఇక పంజాబ్ బౌలర్లలో ఆర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, విజయ్‌కుమార్ విషాక్ చెరో రెండు వికెట్లు తీశారు. హర్ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.

Read Also: Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లలో ఏది బెస్ట్ ఛాయిస్..?

ప్రియంశ్ ఆర్యా, ప్రభసిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్‌ తరఫున ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టారు. తొలి మూడు ఓవర్లలో కేవలం 18 పరుగులే వచ్చాయి. ప్రభసిమ్రాన్‌ ను బుమ్రా 13 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్ క్రీజులో స్థిరంగా ఉండి ప్రియంశ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిదే పని చెప్పటాడు. అలా 10 ఓవర్లకు జట్టు స్కోరు 89/1 కు చేరుకుంది. ఆ తర్వాత ఇంగ్లిస్, ప్రియంశ్ ఇద్దరూ 12వ ఓవర్లో అర్ధసెంచరీలు నమోదు చేశారు. 14వ ఓవర్లో వీరిద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ 15వ ఓవర్లో ప్రియంశ్‌ను 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. 16 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోరు 158/2 కు చేరుకుంది. ఆపై ఇంగ్లిస్ 73 పరుగులు చేసిన తర్వాత శాంట్నర్ అతన్ని కూడా ఔట్ చేశాడు. ఇక చివరగా శ్రేయాస్ అయ్యర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌ లో సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Exit mobile version