Site icon NTV Telugu

Preity Zinta : ఆ రెండు సంఘటనలు జీవితంలో మర్చిపోలేను

Preity Zinta

Preity Zinta

Preity Zinta : కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దిల్ సే సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రీతి జింటా. హిందీతో పాటు తెలుగులో కూడా నటించారు. తెలుగులో నటించినవి రెండు సినిమాలైనా అవి సూపర్ హిట్ కొట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన ప్రీతి పరిమితమైయ్యారు. అక్కడ ఈ బ్యూటీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. వాటిని ఉద్దేశించి ప్రీతి జింటా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండు సంఘటనలు తన జీవితంలో మర్చిపోలేనని తెలిపింది. ఆ రెండు తలుచుకుంటే.. ఇప్పటికీ షాక్ లోకి వెళ్ళిపోతున్నా అంటోంది బ్యూటీ.

Read Also: Chennai-Delhi Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..తప్పిన ప్రమాదం

అందులో రీసెంట్‌గా తనకు ఎదురైన రెండు సంఘటనలను వివరించారు ప్రీతి జింటా. ‘తాను తన కూతురు కలిసి ఉండగా గుర్తు తెలియని మహిళ వచ్చి తన కూతురుతో ఫోటో తీసుకుంటానని అడిగింది. అందుకు నేను ఒప్పుకోలేదు. వెంటనే అనూహ్యంగా నా కుమార్తెను గట్టిగా హత్తుకుని, మూతి పక్కన ముద్దుపెట్టింది. దాంతో షాక్ కు గురయ్యాను. తాను షాక్ లో నుంచి కోలుకునే లోపు ఆ మహిళ పారిపోయింది’ అని చెప్పారు ప్రీతి జింటా.

Read Also: Helmetless Cops : మీరే ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపితే ఎలా ?

ఇక, ఈ వారంలోనే జరిగిన మరో సంఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు ప్రీతి. ‘నా స్నేహితులతో కలిసి కారులో ఎయిర్‌ పోర్టుకు వెళ్తుండగా ఒక దివ్యాంగుడు అడుక్కోవడం కోసం తన కారు దగ్గరకు వచ్చాడు. చాలా కోపంగా ప్రవర్తించాడు. వీల్‌చైర్‌లో కారు దగ్గరికి వచ్చి.. డబ్బు కావాలని గట్టిగా అడిగాడు. డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదు’ అని ప్రీతి చెప్పారు. అంతేకాదు తన పక్కనే ఉన్న స్నేహితురాలు పర్సులో నుంచి కొంత చిల్లర తీసి ఇస్తే.. అది సరిపోదని విసిరికొట్టాడని, తాను వెళ్తుంటే వీల్‌చైర్‌తో వెంబడించాడని అన్నారు. ఆ ఘటన కూడా తనను షాక్‌కు గురిచేసిందని తెలిపారు. ఈ రెండు సంఘటనలను తాను మర్చిపోలేనని అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

Exit mobile version