Site icon NTV Telugu

Pregnant Woman: పెళ్లైన ఐదు నెలలకే.. భర్త తనతో కలిసి తినడానికి నిరాకరించాడని భార్య దారుణం..

Up

Up

ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు పురుషులు, మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. భార్య కూర సరిగా వండకున్న గొడవలే.. భర్త తన వంటను మెచ్చుకోకున్నా వివాదమే.. ఇలా టీ కప్పులో తుఫానులాగా భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా యూపీలోని తిల్హార్‌లోని ప్రహ్లాద్‌పూర్ గ్రామంలో ఓ గర్భిణీ స్త్రీ భర్త తనతో కలిసి అన్నం తినడానికి నిరాకరించాడని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read:ICC: హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా, ఫర్హాన్‌కు వార్నింగ్..!

ప్రహ్లాద్‌పూర్ గ్రామానికి చెందిన వీర్‌పాల్ భార్య రచన మూడు నెలల గర్భవతి. సెప్టెంబర్ 22న, రచన పాయిజన్ తాగింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. పిలిభిత్‌లోని సుంగర్హి ప్రాంతంలోని గుటైయా గ్రామానికి చెందిన రచన తండ్రి జగ్జీవన్ మాట్లాడుతూ.. అల్లుడు తన కుమార్తెను హింసించాడని ఆరోపించాడు. వివాహం జరిగి ఐదు నెలలే అయ్యిందని తెలిపాడు. కుమార్తెను ఆమె అత్తమామలు ఇంట్లో రోజూ వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆమె భర్త వీర్పాల్ మాట్లాడుతూ ఎప్పుడూ తన భార్యతో కలిసి భోజనం చేసేవాడినని చెప్పాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version