Site icon NTV Telugu

Pregnancy Planning: ప్రెగ్నెన్సీకి ప్లానింగ్‌ చేసుకుంటున్నారా? జంటలు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Pregnancy Planning

Pregnancy Planning

Pregnancy Planning: ఒక కొత్త జీవాన్ని ఈ లోకానికి తీసుకురావాలంటే, దానికి ముందు కాబోయే తల్లిదండ్రులిద్దరూ శారీరకంగా, మానసికంగా, జీవనశైలిలోనూ పూర్తిగా సిద్ధం కావాలి. ప్రెగ్నెన్సీకి కనీసం మూడు నెలల ముందు (90 రోజులు) కొన్ని అలవాట్లు పూర్తిగా మానేయడం చాలా అవసరం. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..

స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలు పురుషులు, మహిళలు ఇద్దరూ తప్పనిసరిగా మానుకోవాలి. ఇవి గర్భధారణకు ప్రతికూల ప్రభావాలు చూపించి, బేబీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాగే వారి ఆహారపు అలవాట్లలో మార్పులు చాలా అవసరం. ఫుడ్ అడిటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఐటమ్స్ వాడకం ఆపాలి. వీటి బదులు సింపుల్ ఇండియన్ ట్రెడిషనల్ హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఫైవ్ వైట్స్ (చక్కెర, ఉప్పు, మైదా, తెల్ల బియ్యం, పాలు) తీసుకోవడం తగ్గించుకోవాలి.

Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!

వీటితోపాటు జీవమా శైలికి సంబంధించి నైట్ షిఫ్ట్స్ తగ్గించి, సరైన నిద్ర సమయాలు పాటించాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ (కూర్చునే జీవన విధానం) మానేసి, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఒత్తిడి గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక డీటాక్స్, ఆరోగ్యకర వాతావరణం విషయానికి వస్తే.. చుట్టుపక్కల ఉండే కెమికల్ ఎక్స్పోజర్స్ ను తగ్గించుకోవాలి. ఇలా శరీరాన్ని సహజంగానే డీటాక్స్ చేస్తే, బేబీకి ఆరోగ్యకరమైన ఫౌండేషన్ ఇవ్వగలుగుతారు.

ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ అనేది కేవలం శారీరక సిద్ధతే కాదు.. ఒక జంటగా బాండింగ్, అండర్ స్టాండింగ్ పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇద్దరు కలిసి ఎక్కువ సమయం కలిసి గడపడం, ఇంటి పనులు పంచుకోవడం, ఒక టీమ్‌లా కలిసి ముందుకు సాగడం లాంటి చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనుభవం మరింత అందంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

HYDRA : హైడ్రాను అభినందించిన హైకోర్టు.. ప్రజా ఆస్తులను కాపాడడానికి హైడ్రా అవసరమంటూ కితాబు

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version