Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ‘రౌడీ జనార్దన’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ సర్కీల్‌లో టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ జోరుగా ప్రచారంలోఉంది. మేకర్స్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సాంగ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రోమాన్స్ చేయడానికి కన్నప్ప ఫేమ్ ‘ప్రీతి ముకుందన్’ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ బ్యూటీ సాంగ్‌లో ఆడిపాడటంతో పాటు ఓ చిన్న పాత్రలో కూడా అలరిస్తుందట. ఇందులో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ కనువిందు చేయనుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
READ ALSO: SIP vs PPF.. డబ్బు సృష్టించడంలో ఏది బెటర్ ఛాయిస్? ఒక లుక్ వేయండి..
