NTV Telugu Site icon

Preeti Jhangiani : ఆ కారణంగానే నేను సినిమాలకు దూరం అయ్యాను.

Whatsapp Image 2023 07 16 At 3.09.08 Pm

Whatsapp Image 2023 07 16 At 3.09.08 Pm

ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ ఆ తరువాత ప్రీతి జింగానియా నటించిన తెలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో సరిగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి తేజం అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది.2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ సినిమాలోనూ ఈ భామ కనిపించలేదు.సినిమాలకు దూరంగా వున్న ఈ భామ  ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఫాస్‌ వెబ్‌ సిరీస్‌తో ఈ భామ రీఎంట్రీ ఇచ్చింది.ఇటీవల ప్రీతీ తాను సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటో తెలిపింది.

ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ.. నేను కోరుకున్న పాత్రలు నాకు రాలేదు.. నాకు వచ్చిన పాత్రలతో నాకు అంతగా సంతోషంగా అనిపించలేదు. నాకు సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమా మొత్తం నేనే హైలైట్‌ అవ్వాలని అయితే చెప్పడం లేదు.కనీసం కథలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నాకు రాలేదు. అలాంటప్పుడు నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని సినిమాలకు దూరం అయ్యాను.హిందీ సినిమాలలో నటించడం మానేసాను కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు మరియు షోస్ ఇలా ఎన్నో చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలుగ లేదు.కాకపోతే బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడాన్ని బాగా మిస్‌ అయ్యాను. కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది.