Preeti Phone Call : ‘అమ్మా నాకు భయమేస్తోంది’.. ప్రీతి ఆడియో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preeti Phone Call : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి ఆవేదన వెళ్లబోసుకుంది. కాగా, సైఫ్ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో బయటపడింది.
Read Also: Pakistan: ఇంట్లో ఖరీదైన కార్లు.. చేసేది భిక్షాటన.. మోసపోయిన డాక్టర్..
Also Read
‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై కంప్లైంట్ ఇస్తే.. సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్ఓడీ నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది.
Read Also: Naveen Friend : వైరల్ అవుతున్న నవీన్ ఫ్రెండ్ ఫోన్ కాల్
సైఫ్‌తో తాను మాట్లాడతానని.. సమస్య లేకుండా చూస్తానని తల్లి ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!