Bharathi Builders: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రీ లాంచ్ స్కాం వెలుగు చూసింది. ‘భారతి బిల్డర్స్’ అనే డెవలపర్ కంపెనీ పేరుతో 250 మందికిపైగా కొనుగోలుదారులను మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధితులు కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ప్రాజెక్ట్ పని ముందుకు సాగకపోవడం, భూమిని మూడో వ్యక్తికి విక్రయించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య
భారతి బిల్డర్స్ సుమారు ఐదేళ్ల క్రితం ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, దానికి సంబంధించి 250 మంది నుండి కోట్లు రూపాయల్ని వసూలు చేసింది. కానీ, ఇప్పటికీ కనీసం 25% పనులు కూడా పూర్తి చేయలేదు. ప్రతిసారీ సాకులు చెబుతూ బాధితులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పనులు వేగంగ జరుగుతాయి అంటూ హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. అయితే , ఇంతలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న భూమిని డెవలపర్ సంస్థ సునీల్ అహుజా అనే వ్యక్తికి రహస్యంగా విక్రయించినట్లు బయటపడింది. దీనిపై బాధితులు అభ్యంతరం చేయడంతో.. వారిని బెదిరింపులు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సామాన్యులకు కూడా ఎంట్రీ పై.. ఇంట్రస్టింగ్ అప్ డేట్
ఈ ఘటనపై బాధితులు సైబరాబాద్ EOW పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో భారతి బిల్డర్స్‌తో పాటు సునీల్ అహుజా పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు మోసం, పెట్టుబడిదారుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మరోసారి ప్రీ లాంచ్ ప్రాజెక్టుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతటి అవసరం అనే విషయాన్ని రుజువు చేస్తోంది. సరైన అనుమతులు, నిర్మాణ పురోగతి లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టె సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
