Pre First Night Shoot Video Viral: ఈ మధ్య ప్రజలు కొత్త పుంతలు తొక్కడంలో బాగా ఆరితేరుతున్నారు. ప్రజల్లో పిచ్చి పరాకాష్టకు చేరుతుందన్నడానికి కొన్ని తాజా సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విదేశీయులు భారతీయ సంస్కృతిని మెచ్చి ఇటువైపు అడుగులు వేస్తుంటే.. భారతీయులు మాత్రమే., అందుకు విరుద్ధంగా పాశ్యాత్య సంస్కృతి వైపు అలవాటు పడుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా నూతన వధూవరులు పెళ్లి చేసుకునే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో పొలాల్లో, వాగులు, వంకలు, నదులు, సముద్రాలు ఇలా ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఫోటోషూటులు చేసుకోవడం చాలామందిని చూసాం. మరికొందరైతే వారి క్రియేటివిటీని ఉపయోగించి బురదలో దొర్లుతూ ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసేస్తున్నారు కూడా. అలా కొంతమంది చేసే ప్రివెడ్డింగ్ షూట్లలో ఒక్కొక్కసారి పొరపాటు జరిగి వారి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న ఘటనలు లేకపోలేవు. అయితే ఈ ట్రెండ్ కాస్త పాతది అయిపోయిందని అనుకున్నారేమో.. కానీ., తాజాగా కొన్ని జంటలు మరో కొత్త ట్రెండును సృష్టించారు. అదే ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్..
Krishna : ఘట్టమనేని అభిమానులకు చేదు వార్త..ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు హఠాన్మరణం..
మామూలుగా శోభన కార్యక్రమాలు అంటే కేవలం నాలుగు గోడల మధ్య జరిగే ఓ అపురూపమైన కార్యం. కాకపోతే., ఈ రోజుల్లో ప్రజలు వినుఁతంగా ఆలోచించడంతో కొత్తకొత్త ప్లాన్స్ చేసేస్తున్నారు. ఈ కొత్తదనం కోరుకుంటున్న ఆలోచనలు ఎటువైపు దారితీస్తాయో తెలియదు కానీ.. తాజాగా ఓ యువ జంట వారి శోభనం రాత్రిని విన్నున్తంగా జరుపుకోవాలని ఆలోచించారు. అందుకు తగ్గట్టుగా గానే వారు ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్ ను ఏర్పాటు చేసుకున్నారు. వారు చేసుకోబోయే శోభనం కార్యక్రమం సంబంధించిన గదిని పూర్తిగా అలంకరించి వాటిలో కొన్ని దృశ్యాలను షూట్ చేసి భద్రపరుచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు శోభనం గదిలోకి వెళ్లే ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేయడం కనపడుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వారిపై మండి పడుతున్నారు. కొత్తదనం సృష్టించాలి కానీ.. అది మరీ ఎక్కువైతే., అనర్ధాలకు దారి తీస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.
Libya Floods : వరదలకు కారణం వాళ్లే..12 మంది అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష
కొత్త ట్రెండ్..: ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్.. pic.twitter.com/sFANzr9T0k
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) July 28, 2024