Praveen Pagadala : సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. హత్య కారణం కాదని, మద్యం తాగిన ఉన్న స్థితిలో సెల్ఫ్ యాక్సిడెంట్ ఏకైక కారణమని తేల్చి చెప్పారు. ఇవాళ రాజమండ్రిలో ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 42 సిసి ఫుటేజ్ లను విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం గుర్తించామని స్పష్టం చేశారు. ప్రవీణ్ మూడు చోట్ల మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిసి ఫుటేజ్ లను ఫోరెన్సిక్ ద్వారా నిర్ధారణ చేసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆల్కహాల్ వచ్చిందని వెల్లడించారు.
సుమారు 500 వీడియో ఆధారాలు సేకరించి… 92 మందిని విచారణ చేశామనీ తెలిపారు. బుల్లెట్ పై స్పీడ్ గా రావడం కారణంగా ఘటనా స్థలంలో ఉన్న కంకర రాళ్లుపై బుల్లెట్ స్కిడ్ అయినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రెండు వారాల సమయం ఇచ్చిన హత్య అని ఆరోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు ఎవరు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈరోజుతో కేసు దర్యాప్తు పూర్తి చేసామని… అనవసరంగా ఈ విషయాన్ని ఇంకా వివాదం చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. దయచేసి ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని డిస్టర్బ్ చేయకండి అంటూ ఐ జి అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి రెచ్చగొట్టే ప్రకటన చేసిన 11 మందిపై కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!