NTV Telugu Site icon

Prathipati Pullarao: అసని తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలి

Pullarao

Pullarao

ఇటీవల సంభవించిన అసని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు. రాష్ట్రంలో అస‌ని తుఫాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవ‌సాయ మోటార్లకు మీట‌ర్లు బిగించే కేంద్ర ప్రతిపాద‌న‌ను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ అని గొప్పలు చెప్పకునే ముఖ్యమంత్రి వ్యవ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు బిగించడం దారుణం అన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో ఆరాధ్య అనే చిన్నారి ప్రభుత్వ నిర్లక్ష్యం వ‌ల‌నే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతికి ప్రభుత్వం బాధ్యత వ‌హించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల‌లో స్వీప‌ర్లు, సెక్యూరిటీ గార్డులు చేత చికిత్స చేసే దుస్థికి ప్రభుత్వం వ‌చ్చింది. తెలుగుదేశంపార్టీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు పెట్టాల‌నే ఆలోచ‌న త‌ప్ప ఓట్లేసిన ప్రజ‌ల‌కు న్యాయం చేద్దాం అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.

ఎన్టీఆర్ ట్రస్టు ప్రాప‌ర్టీని ప‌రిశీలించేందుకు మేము వెళ‌తామంటే మునిసిప‌ల్ అధికారులు దాడులకు పాల్పడ్డారు. అధికారులు ఉద్యోగాలు కాపాడుకోవ‌డానికి, చేసిన త‌ప్పులు క‌ప్పి పుచ్చుకోవ‌డానికి లేని అధికారాన్ని ఉప‌యోగించ‌డం దుర్మార్గం అన్నారు పుల్లారావు. మేనిఫెస్టోలో హామీలు అమ‌లు చేయ‌లేని వారిని రీకాల్ చేయాల‌ని పాద‌యాత్రలో జ‌గ‌న్‌ అన్నార‌ు. ఇప్పుడు హామీలు అమ‌లు చేయ‌ని జ‌గ‌న్‌ను ఎందుకు రీకాల్ చేయ‌కూడ‌దు? అని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

Gun Fire : అమెరికాలో మళ్లీ పేలిన తూట.. ఇద్దరు మృతి