NTV Telugu Site icon

Prattipadu TDP:ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు… ఏలేశ్వరంలో ఆందోళన

Tdp1

Tdp1

ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ప్రత్తిపాడులో టీడీపీ నేతలు నియోజకవర్గ ఇంఛార్జి ని మార్చాలంటు ఏలేశ్వరం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ వరుపుల రాజా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాడు టీడీపీ నేతల్లో ఐక్యత కొరవడిందా? అధిష్టానం పట్టించుకోవడం లేదా? తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Dharmana Prasada Rao: విశాల ప్రయోజనాలతో మూడు రాజధానులు

ప్రస్తుతం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న వరుపుల రాజా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి సొంత వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని రాజా వ్యతిరేకవర్గం నిరసన వ్యక్తం చేశారు.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ కష్ట కాలంలో పార్టీని వదిలి వెళ్లి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.. టీడీపీ అసమ్మతి వర్గం ఆందోళనతో ఏలేశ్వరంలో కొద్దిసేపు ట్రాపిక్ జామ్ అయింది. అధినేత జిల్లా పర్యటనకు మరి కొద్ది సేపట్లో రానుండగా సైకిల్ పార్టీ పత్తిపాడు లీడర్ల విభేదాలు బయటపడ్డాయి. అధిష్టానం కలుగచేసుకుని తెలుగు తమ్ముళ్ళతో మాట్లాడితే గానీ విభేదాలు సమసిపోయేలా లేవు. మరి అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

Read Also: Venu, Abhay: ఈ కమెడియన్స్ డైరెక్టర్స్ గా సక్సెస్ సాధిస్తారా!?

ఉమ్మడి జిల్లాలో బాబు పర్యటన

ఉమ్మడి జిల్లాలో 3 రోజులు పర్యటన నిమిత్తం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు తెలుగు తమ్ముళ్ళు. కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైంది చంద్రబాబు టూర్. జగ్గంపేట నియోకవర్గంలో చంద్రబాబు రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు.