Site icon NTV Telugu

Tesla: దేశంలో టెస్లా కారు మొదటి డెలివరీ.. మోడల్ Yని అందుకున్న మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్

Tesla

Tesla

ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి డెలివరీని ప్రారంభించింది. టెస్లా జూలై 15న తన ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV, టెస్లా మోడల్ Yని విడుదల చేయడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ధర సుమారు రూ. 60 లక్షలు. జూలై 15న ప్రారంభించబడిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ‘టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్’లో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ వైట్ కలర్ మోడల్ Y కారును డెలివరీ తీసుకుంటున్నట్లు వార్తా సంస్థ ANI వీడియో షేర్ చేసింది.

Also Read:Tirumala: మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు.. భక్తులకు నో టెన్షన్‌.. !

ఈ కారు రెగ్యులర్ మోడల్ అవునా లేక లాంగ్ రేంజ్ అవునా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. RWD ధరలు రూ. 59.89 లక్షల నుంచి, లాంగ్ రేంజ్ RWD ధరలు రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.(ఎక్స్-షోరూమ్). ఇప్పటివరకు, టెస్లాకు 600 బుకింగ్‌లు వచ్చాయని బ్లూమ్‌బెర్గ్ మంగళవారం నివేదించింది. టెస్లా ఈ సంవత్సరం భారతదేశానికి 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటిలో మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి వస్తుంది.

టెస్లా మోడల్ Y భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏకైక మోడల్. రియర్-వీల్ డ్రైవ్, లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ అనే రెండు వేరియంట్‌లను అందిస్తున్న ఈ కారు ధర రూ. 60 లక్షలు కాగా, రెండో కారు ధర రూ. 68 లక్షలు. ఈ రెండు వేరియంట్లలో, లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ 622 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. 5.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Also Read:Storyboard: కొత్త జీఎస్టీ రేట్లు ట్రంప్ టారిఫ్‌లకు కౌంటరేనా..?

సూపర్‌ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. 15 నిమిషాల్లో 267 కి.మీ. రేంజ్ ను అందిస్తాయి. బేస్ ధరలకు అదనంగా రూ. 6 లక్షలు చెల్లించడం వల్ల కస్టమర్లకు టెస్లా పూర్తి సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) ప్యాకేజీ లభిస్తుంది. కస్టమర్లు టెస్లా మోడల్ Y ని దాని అధికారిక ఇండియా పోర్టల్ ద్వారా లేదా ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2025 మూడవ త్రైమాసికంలో మోడల్ Y కోసం హ్యాండ్‌ఓవర్‌లు జరుగుతాయని భావిస్తున్నారు.

Exit mobile version