NTV Telugu Site icon

Prashanth Varma : ఆ వెర్షన్ లో రిలీజ్ కానున్న హనుమాన్ మూవీ.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ..

Whatsapp Image 2024 03 02 At 4.43.37 Pm

Whatsapp Image 2024 03 02 At 4.43.37 Pm

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సూపర్ హీరో చిత్రం అద్భుత విజయం సాధించింది.రూ.40 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీ సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించింది.. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో నేడు (మార్చి 2) హనుమాన్ మూవీ టీమ్ 50 రోజుల వేడుక నిర్వహించింది.హనుమాన్ సినిమా 150 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రం రిలీజై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నేడు హిస్టారిక్ 50 డేస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍లో దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హనుమాన్ సినిమా రీమాస్టర్డ్ వెర్షన్ రానుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ వెర్షన్ మరింత సర్‌ప్రైజ్ చేస్తుందని ఆయన అన్నారు. అయితే, ఈ హనుమాన్ రీమాస్టర్డ్ వెర్షన్ మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేదా ఓటీటీలోకి వస్తుందా అనేది మాత్రం ప్రశాంత్ వర్మ స్పష్టతనివ్వలేదు.హనుమాన్ సినిమా 150 థియేటర్లలో 50 రోజులు ఆడడం అనేది చాలా మందికి నమ్మకాన్ని ఇస్తుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.. అందుకే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సినిమా ఓ వీకెండ్ ఆడితే చాలా డబ్బులు వచ్చేస్తాయానే మైండ్ సెట్ ఉందని, అయితే 50 రోజులు, 100 రోజులు కూడా ఆడుతుందనే నమ్మకాన్ని కొత్తగా వచ్చే దర్శకులు, నిర్మాతల్లో కలిగించేందుకు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.హనుమాన్ సినిమాను త్వరలో అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రశాంత్ వర్మ వెల్లడించారు.. జపాన్, చైనా మరియు స్పెయిన్‍‍లోని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడామని, వారికి బాగా నచ్చిందని అన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని హనుమాన్ చాటనుందని ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు

Show comments