NTV Telugu Site icon

Prashanth Varma : ప్రశాంత్ వర్మ భార్య ఎంత అందంగా ఉందో చూశారా?

Prasanth Varma (2)

Prasanth Varma (2)

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది..

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో కనిపించారు. అయితే ఇదే వేడుకలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన భార్యను పరిచయం చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.. ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన ‘అ!’ మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి..

ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ లాంటి చిత్రాలతో భారీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సినిమా హనుమాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నాడు..ప్రశాంత్ వర్మని చూస్తే యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఇంకా సింగిల్ ఏమోనని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నాడు.. అప్పటికి ఇతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికీ తెలీదు. తాజాగా ‘హనుమాన్’ సక్సెస్ ఈవెంట్‌లో స్పీచ్ తన భార్యకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.. ప్రస్తుతం సుకన్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments