NTV Telugu Site icon

Prashanth Neel: అందుకే నా సినిమాలు అన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి

Neel

Neel

Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రం బృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చాడు. ఉగ్రం సినిమా నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి. దీనివలన ఈ సినిమాలు మొత్తం ప్రశాంత్ కు నచ్చినట్లే తీయడం జరిగింది. ఇక దీంతో అభిమానులు నిత్యం .. అన్నా.. నువ్వెప్పుడు కలర్స్ వాడవా అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ దానికి సమాధానం చెప్పాడు. ఎందుకు మీ సినిమాల్లో ఎక్కువ కలర్స్ వాడారు అన్న ప్రశ్నకు ప్రశాంత్ మాట్లాడుతూ.. ” నాకు OCD ఉంది. దాని వలన ఎక్కువ కలర్స్ చూడాలంటే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకే నా సినిమాలు అన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తారో చూడాలి.

Show comments