Site icon NTV Telugu

Prasanth Varma : ‘హనుమాన్’ లో ఆ ఒక్క షాట్ కోసం రెండేళ్లు కష్టపడ్డాం..

Whatsapp Image 2024 01 06 At 4.37.31 Pm

Whatsapp Image 2024 01 06 At 4.37.31 Pm

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో వరుసగా బిగ్ మూవీస్ బరిలోకి దిగుతున్నాయి.బరిలో దిగుతున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ మూవీ ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. తాజాగా ట్రైలర్ చివర్లో ఉన్న హనుమంతుడి కళ్ల షాట్ గురించి దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.ఆ షాట్ ని అలా తీసుకురావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. అంటే ఆ సీక్వెన్స్ మొత్తానికి అంత సమయం పట్టింది.

ఒక షాట్ తర్వాత ఒక షాట్ చేయము కదా. అన్ని ఒకేసారి చేసుకుంటూ వచ్చాం. వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఆ షాట్ చూసుకున్నప్పుడు మాకు కూడా మంచి అనుభూతి కలిగింది అంటూ ఆ సీన్ వెనుక ఉన్న కష్టాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మబయటపెట్టాడు. అంతే కాకుండా ‘హనుమాన్’ కథ గురించి కొంచెం క్లారిటీ కూడా ఇచ్చాడు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వకముందు ప్రేక్షకులు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు.మొదట ఈ సినిమాను అందరూ ఒక యానిమేషన్ సినిమా అని 3డీ ఫార్మాట్ లో వస్తుంది అని అనుకున్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది హనుమంతుడి కథ అనుకున్నారు. కానీ ఇది హనుమంతుడి కథ కాదు. మనందరిలాగా ఒక సాధారణ మనిషి కథ అని దర్శకుడు తెలిపాడు.ఇది హనుమంతుడి భక్తుడి కథ. ఒక వ్యక్తి ధర్మం కోసం నిలబడినప్పుడు హనుమంతుడు ఎలా అతడికి సాయం చేశాడు. ఎలా తన పవర్స్ ను ఇచ్చి ఆ వ్యక్తిని సూపర్ హీరో చేశాడు అనేది ఈ సినిమా కథ..అని ప్రశాంత్ వర్మ తెలిపాడు

Exit mobile version