NTV Telugu Site icon

Prasanth Varma : సినిమాల్లోకి వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రశాంత్ వర్మ ఓపెన్ ఆఫర్..

Pvcc

Pvcc

హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను వెల్లడించాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఒక పెద్ద స్టార్‌తో కలిసి పని చేయనున్నారు..

జై హనుమాన్ కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు మరియు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం. ఈనేపథ్యంలో డైరెక్టర్ ఒక పోస్ట్ చేశారు.. కళాకారులందరికి సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు..

అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? అది స్పిన్నింగ్ కథలు, ఎడిటింగ్, నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్ లేదా బహుశా మీరు మార్కెటింగ్ మేవెన్, ఊపిరి పీల్చుకోండి. మీ కళాత్మక నైపుణ్యాలతో ప్రపంచంలోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాతో చేరడానికి “talent@thepvcu.com”కి పంపండి అని పేర్కొన్నాడు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి మాట్లాడాడు.మీకు వీటిపై ఆసక్తి ఉంటే ఇక ఆలస్యం ఎందుకు వెంటనే పనిని ప్రారంభించండి..