NTV Telugu Site icon

Hanuman In USA: వావ్.. అమెరికాలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట..

Hanuman

Hanuman

90 Feat Hanuman Statue in USA: ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఎత్తైన హనుమాన్ విగ్రహాలను నిర్మించడం పరిపాటిగా మారిపోయింది. భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ కాబట్టి ఇలా జరగడం సాధారణమే. అయితే ఇదివరకు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే ఏదో ఓ జోక్ చేసినంత విషయంగా చూసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా లాంటి పెద్ద దేశాల్లోనే హిందువులు అనేక చోట్ల దేవాలయాల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి భక్తులను గుడి వైపు నడిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల భారీ ఎత్తున హిందూ దేవతల విగ్రహాలని నిర్మిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ప్రాజెక్ట్ పూర్తయింది

Water Supply: ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయండి.. జలమండలి ఆదేశం..

అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో ఓ భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాదు నాలుగు రోజులు పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఆ విగ్రహాన్ని ప్రారంభించారు. హోస్టన్ నగరంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ ఆంజనేయ స్వామి 90 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరును పెట్టారు. ఇక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహికులు భారీ ఎత్తున నిర్వహించడంతో.. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా., విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కారణంగా హెలికాప్టర్ తో విగ్రహం పై పూల వర్షం కురిపించారు. జై వీర హనుమాన్ అంటూ నగరంలోని అనేక ప్రాంతాలు మార్మోగాయి.