Site icon NTV Telugu

Prakash Raj: మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడారా..?

Manipur

Manipur

హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సదస్సులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.

Team India: టీమిండియా కోచ్‌ రేసులో మరో కొత్త పేరు

జోకర్‎ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే అని ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయన్నారు. ప్రస్తుతం మనం, మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు.

Rahul Gandhi: విదేశాల బాట పట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత.. సెప్టెంబర్లో యూరప్కు రాహుల్

సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలందరూ సంఘటితమైనదే ఈ సమూహ ఫోరమ్ అన్నారు. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమని ఆయన తెలిపారు. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఇది అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

Exit mobile version