NTV Telugu Site icon

Prakash Raj: “గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని”

Pawan Kalyan Vs Prakash Raj

Pawan Kalyan Vs Prakash Raj

పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ముందు ట్వీట్ చేయగా ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పాత ట్వీట్లను తవ్వితీసి “గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” అంతేనా అంటూ ఎద్దేవా చేశాడు.

Khaidi 2: డిల్లీ బాబు దిగుతున్నాడు!

ఈ ట్వీట్‌తో పవన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన కామెంట్స్ రాజకీయంగా, సామాజికంగా చర్చలకు దారితీశాయి. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. పవన్ అభిమానులు ఈ విమర్శలను తీవ్రంగా ఖండిస్తుండగా, ప్రకాష్ రాజ్ మాత్రం తన విమర్శల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ ట్వీట్ వివాదం మరింత ముదురుతుందా లేక శాంతించి పోతుందా అనేది చూడాలి.