రాంచరణ్, ఉపాసన దంపతుల కు త్వరలోనే బిడ్డ పుట్టబోతుంది.చిత్ర పరిశ్రమలో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాం చరణ్ ఎంతగానో బిజీ గా ఉన్నా కానీ తన భార్య కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.రాం చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు.తన భార్య కోసం అలాగే తన బిడ్డ కోసం కొన్ని నెలలు షూటింగ్ ను వాయిదా వేసుకోనున్నట్లు సమాచారం.ఈ ఏడాది జులై లో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుంది.. ఇప్పటికే పుట్టబోయే బిడ్డకోసం ఉపాసన ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం చాలా మంది కానుకలు కూడా పంపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉపాసన ఓ గిఫ్ట్ ను అందుకున్నారని తెలుస్తుంది. ఆ గిఫ్ట్ ఏమిటి అంటే రామ్ చరణ్- ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన ఉయ్యాలా గిఫ్ట్ గా పంపించారు.దాన్ని పంపిన వారు ప్రజ్వలా ఫౌండేషన్. ప్రజ్వలా ఫౌండేషన్ చరణ్- ఉపాసనలకు పుట్టబోయే బిడ్డకోసం అందమైన ఉయ్యాలను చేయించి కానుకగా ఇచ్చారు, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు ఉపాసన.ప్రజ్వల ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ భాధిత మహిళల కు ఉపాధితో పాటు ఆశ్రయం ను కూడా కల్పిస్తోంది. ఇక ఆ మహిళలు తయారు చేసిన ఉయ్యాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ..ఎంతో సంతోషంగా ఉంది. మీరు పంపిక ఈ అద్భుత కానుక నాకు ఎంతగానో ఆనందం కలిగించింది. ఈ ఉయ్యాలా ధైర్యం, బలం, ఆత్మగౌరం మరియు ఆశకు ప్రతీకగా తన బిడ్డకు ఎప్పటికి గుర్తుండిపోతుందని.. ఈ కానుకను అందుకున్నందుకు నాకు గర్వం గా ఉందని కామెంట్ చేసారు ఉపాసన.
