కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాలు చేసిన హాట్ బ్యూటిగా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. ఫ్రెండ్స్ తో ట్రిప్ వేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.. ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నారు. ఆమె తన టూర్ ఫోటోస్ ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తున్నారు. ప్రగ్యా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్ పరంగా డల్ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. ప్రగ్యా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు లేదు.. బాలయ్య అఖండ సినిమాలో చేసింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన కూడా అమ్మడుకి ఒక్క ఆఫర్ కూడా రాలేదని చెప్పాలి.. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రగ్యా వెలుగులోకి వచ్చారు.. ఆ తర్వాత వరుస సినిమాలు ప్లాప్ లను పలకరించాయి..
అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చేలేకపోయింది.. ఇక ఖాళీగా ఉండటం ఇష్టం లేకుండానే సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకుంటుంది.. ట్రెండ్ ను ఫాలో అవుతూ ట్రేండింగ్ ఉంటుంది.. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు లైకులు, కామెంట్స్ తో రచ్చ చేస్తున్నాయి..