NTV Telugu Site icon

Rahul Gandhi: అవినీతిపరుల అమృతకాలం నడుస్తోంది

Rahul Gandhi

Rahul Gandhi

బీజేపీ ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో అవినీతిపరుల ‘అమృతకాలం’ నడుస్తోందని (Rahul Gandhi) విమర్శించారు. ఢిల్లీలోని ‘ప్రగతి మైదాన్‌ టన్నెల్‌’ లోపాలపై ఓ కథనాన్ని ఉటంకిస్తూ.. ‘ఎక్స్‌’ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. రూ.777 కోట్లతో నిర్మించిన ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ (Pragati Maidan Tunnel) ఒక్క ఏడాదిలోనే పనికిరాకుండా పోయిందని తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోడీ ప్లానింగ్‌తో కాకుండా మోడలింగ్‌తో ముందుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈడీ, సీబీఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయని సెటైర్లు వేశారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారత్ జోడ్ న్యాయ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించారు. ఒడిషాలో ముగించుకున్న రాహుల్.. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగనుంది. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు.