Site icon NTV Telugu

Pragathi: పెళ్లికి ఆ మూడు ఉండాలి.. అవి లేనప్పుడు వేస్ట్..!

Pragathi (1)

Pragathi (1)

Pragathi: నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆవిడ భిన్న విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా నటి ప్రగతి తన జీవితం, కెరీర్, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆవిడ వైవాహిక జీవితం సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక విజయవంతమైన పెళ్లికి లేదా బంధానికి ముఖ్యంగా మూడు అంశాలు ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.

Pragathi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం చూడరు..!

అందులో మొదటిది గౌరవం (Respect). భాగస్వాముల మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం చాలా ముఖ్యం అని అన్నారు. ఇక రెండోది నమ్మకం (Trust). నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడదని తెలిపారు. ఇక చివరిగా మూడోది అవగాహన (Understanding) అని అంటూ.. ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకునే గుణం ఉండాలన్నారు. ఈ మూడు లేనప్పుడు.. ఆ పెళ్లి కేవలం ఒక పేరుకే ఉంటుంది తప్ప అందులో అర్థం ఉండదు వేస్ట్ అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఒక మహిళగా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, కేవలం ఇతరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయకూడదని అన్నారు.

Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!

తన జీవితాన్ని తానే సెలబ్రేట్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ జీవితానికి హీరోలని ఆమె నమ్మాలని అన్నారు. బంధంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, మనశ్శాంతి లేని చోట ఉండటం కంటే బయటకు వచ్చి మనల్ని మనం నిరూపించుకోవడం మేలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా ఫిట్‌నెస్, పవర్ లిఫ్టింగ్‌లో ఆమె సాధించిన విజయం తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.

Exit mobile version