Site icon NTV Telugu

Pragathi Mahavadi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం చూడరు..!

Pragathi

Pragathi

Pragathi Mahavadi: టాలీవుడ్ లో విభిన్న పాత్రలు పోషించిన వ్యక్తి, అలాగే నిజజీవితంలో వైట్ లిఫ్టింగ్ లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇందులో భాగంగా.. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేవాళ్ళు అమ్మాయి కోసం చూడరు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆవిడ మాట్లాడుతూ..

Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్‌లైన్‌ పెట్టిన మంత్రి..

సినిమా అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు.. అది కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన భారీ వ్యాపారం అని అన్నారు. నిర్మాతలు, దర్శకులు ఒక సినిమా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పుడు.. వారి ప్రధాన లక్ష్యం ఆ సినిమా విజయం సాధించి లాభాలు రావడం అనేదానిపై ఉంటుంది. అందువల్ల నటీనటుల ఎంపిక విషయంలో కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు కాకుండా, ఆ పాత్రకు ఎవరు సరిపోతారు.. ఎవరి వల్ల సినిమాకు క్రేజ్ వస్తుంది అనే దానికే ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు.

అలాగే సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే.. కేవలం అందం మాత్రమే సరిపోదు, అపారమైన ప్రతిభ ఉండాలని అన్నారు. కోట్ల పెట్టుబడి పెట్టిన వారు, ఒక నటిని ఎంచుకునేటప్పుడు ఆమె నటన, క్రమశిక్షణ ఇంకా సినిమాకు ఆమె ఇచ్చే వాల్యూను చూస్తారు తప్ప, కేవలం ఆమె వ్యక్తిగత విషయాల కోసం సినిమాను పణంగా పెట్టరని పేర్కొన్నారు. కాస్టింగ్ కౌచ్ లేదా వ్యక్తిగత ప్రయోజనాలు అనే విషయమై ఆమె మాట్లాడుతూ.. సామాజికంగా వినిపించే కొన్ని విమర్శలకు సమాధానంలా కూడా ఇది కనిపిస్తుందని.. కొందరు సినిమా అవకాశాల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటారని అనుకుంటారని.. కానీ, వాస్తవానికి ఒక స్థాయికి వెళ్ళిన దర్శకులు లేదా నిర్మాతలు సినిమా నాణ్యత విషయంలో రాజీ పడరన్నారు. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం వల్ల వారి కోట్ల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆమె అన్నారు.

Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!

ఇంకా పెద్ద హీరోలు, దర్శకులు ఉన్న సినిమాల్లో పని చేసేటప్పుడు ప్రతి నిమిషం విలువైనదని.. అటువంటి చోట “అమ్మాయి కోసం” లేదా ఇతర వ్యక్తిగత కారణాల కోసం సినిమా షూటింగ్‌ను లేదా నాణ్యతను ఎవరూ పక్కన పెట్టరన్నారు.

Exit mobile version