PMJJBY : దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరులకు అటువంటి పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన). దేశంలోని ప్రతి విభాగం ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించాలి. జీవన్ జ్యోతి బీమా పథకాన్ని ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశంలోని పౌరులు ప్రతి సంవత్సరం చెల్లించి ఈ పాలసీని కొనుగోలు చేసి బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ఏదైనా కారణం వల్ల పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల వరకు బీమా క్లెయిమ్ లభిస్తుంది. జీవన్ జ్యోతి బీమా పాలసీని 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. జీవన్ జ్యోతి బీమా పాలసీ మెచ్యూరిటీ వయస్సు 55 సంవత్సరాలు. ఈ టర్మ్ ప్లాన్ ను ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా ప్రీమియం డిపాజిట్ చేయకపోతే మీరు బీమా ప్రయోజనం పొందలేరు. దాంతో మీ పథకం మూసివేయబడినట్లు పరిగణించబడుతుంది. కానీ., ఒక సదుపాయం ఏమిటంటే.. మీరు 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మీకు కావలసినప్పుడు ఈ పథకంలో ప్రవేశించవచ్చు.
UCO Bank Recruitment 2024: UCO బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. జీతం ఎంతంటే..
జీవన్ జ్యోతి బీమా పథకం యొక్క పాలసీని కొనుగోలు చేయడానికి మీరు ప్రతి సంవత్సరం రూ. 436 చెల్లించాలి. 2022 సంవత్సరానికి ముందు పాలసీని కొనుగోలు చేయడానికి కేవలం రూ.330 చెల్లించాల్సి ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం రూ. 436 కు పెంచింది. ఈ బీమా ప్రీమియం జూన్ 1 నుండి మే 30 వరకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో గొప్పదనం ఏమిటంటే.. ఈ పాలసీని పొందడం చాలా సులభం. మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ ని సందర్శించడం ద్వారా లేదా మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పథకం కింద పాలసీని తీసుకోవచ్చు.
SAIL Recruitment 2024: ఇంజినీరింగ్ అర్హతతో లక్షల్లో జీతం.. వివరాలు ఇలా..
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మోడీ ప్రభుత్వం యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. టర్మ్ ప్లాన్ అంటే బీమా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తేనే బీమా కంపెనీ బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. జీవన్ జ్యోతి బీమా యోజన వ్యవధి పూర్తయిన తర్వాత కూడా పాలసీదారు క్షేమంగా ఉంటే, అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. జీవన్ జ్యోతి బీమా పథకం కింద ఇప్పటివరకు 16.19 కోట్ల ఖాతాలు కవర్ చేయబడ్డాయి. అదే సమయంలో ఈ పథకం కింద రూ.13,290.40 కోట్ల క్లెయిమ్ పరిష్కరించబడింది. దేశంలోని ప్రతి వ్యక్తికి జీవిత బీమా ప్రయోజనాన్ని అందించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 9 మే 2015న ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)ని ప్రారంభించింది. జీవన్ జ్యోతి బీమా పథకం కింద పాలసీ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరం.