Site icon NTV Telugu

Pradeep Ranganathan: డైరెక్షన్ చేయబోతున్న స్టార్ హీరో.. హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు!

Pradeep Ranganathan

Pradeep Ranganathan

Pradeep Ranganathan: హ్యాట్రిక్ హిట్స్‌తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో డైరెక్టర్‌గా, హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ హీరోగా తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్‌ చేయడానికి రడీ అవుతున్నారు.

READ ALSO: Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా

ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నట్లు సమాచారం. ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, మార్చి నెలలో షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని టాక్. టాలీవుడ్ ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథ్‌ సరసన అలరిస్తారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుందని సమాచారం. గతంలో ప్రదీప్ రంగనాథ్ డైరెక్షన్ చేసిన ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్.. మళ్లీ ప్రదీప్‌తో ఈ కొత్త సినిమాను నిర్మిస్తుంది. 150-180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా.. ప్రదీప్ కెరీర్‌లోనే అతిపెద్ద స్కేల్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా 2026 గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

READ ALSO: How To Earn ₹1 Crore: కోటి రూపాయలు సంపాదించడానికి సింపుల్‌గా ఇలా చేయండి…

Exit mobile version