సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుత ట్రెండ్‌ను సెట్ చేస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. ‘డ్యూడ్’, ‘లవ్ టుడే’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రదీప్, ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తుతున్నారు. దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన ఆయన, ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సొంతంగా ఒక అఫీషియల్ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన బ్యానర్‌లో రాబోయే మొదటి సినిమానే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Thaman: ‘కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి’.. కొత్త వివాదానికి తెరలేపిన తమన్
ప్రదీప్ రంగనాథన్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో లాంచ్ చేస్తున్నారు. ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించబోతోంది. ఇది ఒక ఫిమేల్ సెంట్రిక్ (స్త్రీ ప్రధాన) ప్రాజెక్ట్ అని సమాచారం. మమితాకు ఉన్న యూత్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక యూనిక్ సబ్జెక్టును ప్రదీప్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ ‘డ్రాగన్’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన సొంత బ్యానర్‌లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అడుగు వేశారు.
కాగా ఈ సనిమా కు సంబంధించిన మరిన్ని వివరాలు దర్శకుడు ఎవరు అనే విషయాలు త్వారలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. మమితా బైజుకు తెలెగె తమిళ భాషల్లో మంచి ఆదరణ అండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ట్రేండ్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఒక యంగ్ హీరో మరో యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ కోసం ప్రొడ్యూసర్ గా మారాడం వెనుక ఏదో ఒక స్ట్రాండ్ పాయింట్ ఉండే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రదీన్ రంగరాధన్ మేకింగ్ స్టైల్ కి అనుగుణంగానే ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్‌గా ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం.
