LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చూస్తుంటే, దర్శకుడు విఘ్నేష్ శివన్ మనల్ని 2040 నాటి కాలానికి తీసుకెళ్లబోతున్నట్లు అర్థమవుతోంది. ఫ్యూచరిస్టిక్ అంశాలతో కూడిన ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం, ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read :Rakasa – Biker : బైకర్ – ‘రాకాస’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్!
Also Read
- 1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే.. సినిమాలో కృతి శెట్టి ‘ధీమా’ అనే పాత్రలో నటిస్తోంది. ఆమె ప్రస్తుత కాలంలోని ఇన్‌స్టంట్ రిలేషన్‌షిప్స్‌ను అస్సలు ఇష్టపడదు, పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆమెకు ప్రదీప్ పరిచయమవుతాడు. అయితే వీరి ప్రేమకథకు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యజమాని ఎస్.జె. సూర్య ఎలా అడ్డుపడ్డాడు? అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో టీజర్ సాగింది. ఎస్.జె. సూర్య మార్క్ యాక్టింగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన పాటలు అక్కడ యూత్‌ను ఊపేస్తున్నాయి. యోగి బాబు, గౌరీ కిషన్ వంటి పేరున్న నటులు ఉండటం సినిమాపై అంచనాలను పెంచింది. తెలుగులో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను శ్రీ పద్మిని సినిమాస్ రిలీజ్ చేస్తోంది. మరి 2040 నాటి ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!