NTV Telugu Site icon

Akkada Ammayi Ikkada Abbayi: కామెడీతో అదరగొట్టిన ప్రదీప్ మాచిరాజు.. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ట్రైలర్ విడుదల

Akkada Ammayi Ikkada Abbayi

Akkada Ammayi Ikkada Abbayi

Akkada Ammayi Ikkada Abbayi: తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజు తనదైన హాస్యం, మాటల తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి అనేక షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయితే బాగా విరామం తర్వాత, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read Also: Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే చేతికి రూ. 10 లక్షలు.. డబుల్ ఆదాయం పక్కా

ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన తాజా సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్‌ను గమించినట్లైతే కథలో హాస్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రదీప్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడిగా నటిస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ పల్లెటూరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, కథలో హీరోయిన్ పాత్ర.. లాంటి విషయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని బజ్ తీసుకరానుంది.

ఈ సినిమాను నూతన దర్శకులు నితిన్-భరత్ తెరకెక్కించగా, ప్రదీప్‌కు జోడీగా దీపిక పిల్లి నటించింది. గతంలో హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన ప్రదీప్ మాచిరాజు, ఈసారి హిట్ కొడతాడా? అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రదీప్ మాచిరాజు రెండో ప్రయత్నం ఫలితంగా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.