Prabhas Tweet on PawanKalyan: ప్రభాస్ డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినందుకు ఆయన అభిమానులు సంతోషంలో తేలుతున్నారు. ఆయనతో సినిమా చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైనర్స్. పోస్టర్ రిలీజ్ చేసింది. దీనికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పవన్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి ‘ఫైర్ స్ట్రోమ్ ఇజ్ కమింగ్’ అనే వ్యాఖ్యను జోడించారు. పోస్టర్ పై THEY CALL HIM #OG అని రాసి ఉంది. అలాగే జపనీస్ భాషలోనూ ఫైర్ స్ట్రోమ్ ఇజ్ కమింగ్ అనే పదాన్ని వాడారు. ఇందులో పవన్ బ్యాక్ ఇమేజ్ కనిపిస్తోంది. పోస్టర్ ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్ మూవీ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also: Rashmika : మహేష్ సినిమాలో రష్మిక.. ఒక్క సాంగ్‌కే అన్ని కోట్లా !
‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్‌టైనర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు హరీశ్ శంకర్‌తో కలిసి ‘భవదీయుడు భగత్‌సింగ్’తో అలరించనున్నారు. ఇదిలా ఉంటే సాహో డైరెక్టర్ తో సినిమా ప్రకటించగానే రెబల్ స్టార్ ప్రభాస్.. పవన్ కల్యాణ్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే ఈ చిత్రబృందం మొత్తం మంచి సక్సెస్ అందుకోవాలని ఆయన కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
