NTV Telugu Site icon

Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో

Prabhas Tt

Prabhas Tt

Prabhas: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజే వేరు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా ఆయనంటే చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం వరుస సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. తన సినిమా కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతే శరవేగంగా తన సినిమాలను పూర్తి చేసుకుంటూ పోతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఈ క్రమంలో ఆయన నుంచి చిన్న అప్డేడ్ వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. ఇటీవల ఆదిపురుష్ సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రభాస్ గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మిల్కీబ్యూటీ తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్నారు ప్రభాస్. అయితే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. తమన్నాను ఎప్పుడు కలిశాడు.. ఎక్కడా చెస్ నేర్పించాడు అనే కదా మీ సందేహం. ఆ వీడియో రెబల్ సినిమా షూటింగ్ సమయంలోనిది.

Read Also: Ayyanna Patrudu Arrest: విశాఖలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతల అరెస్ట్

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలు ఉన్నాయి. మరో ప్రక్క మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బబ్లీ బౌన్సర్ సినిమాతో బాలీవుడ్ లో ఓకే అనిపించుకున్న తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’, బాలీవుడ్ మూవీ ‘బోలె చుడియన్’ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.