Site icon NTV Telugu

Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!

Prabhas

Prabhas

తన అభిమానులను మరోసారి మిర్చి రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు డార్లింగ్ ప్రభాస్. టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘బైకర్’ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అటు శర్వానంద్‌తో ప్రభాస్‌కు మంచి బాండింగ్ ఉంది. దీంతో.. ఈ సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. బైకర్ చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డార్లింగ్. తనదైన స్టైలిష్ లుక్‌లో బైక్‌పై వచ్చి.. ‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 

Also Read : Prabhas : స్పిరిట్‌.. ఎక్కడి వరకు వచ్చింది?

ఇక ప్రభాస్‌కు థ్యాంక్యూ చెబుతూ.. ‘అన్న.. నీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాపై ఉండటం నా అదృష్టం, మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ శర్వానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ లేటెస్ట్ లుక్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ఈ లుక్ ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘మిర్చి’ సినిమా రోజులను గుర్తుకు తెస్తోంది. అయితే, ఈ లుక్ మాత్రం ఆయన నటిస్తున్న ఫౌజీ చిత్రంలోనిదే అని చెప్పాలి. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. 1940 బ్యాక్ డ్రాప్‌లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో సైనికుడిగా కనిపించనున్నాడు ప్రభాస్. దీంతో.. బైకర్ ప్రమోషన్ వీడియో షూట్ కోసం ఆయన డైరెక్ట్‌గా యుద్ధ భూమి నుంచే వచ్చినట్టుగా ఉందని.. రెబల్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. బైకర్ సినిమాకు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్ తోడవడంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కాగా, ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version